News March 27, 2025

వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు

image

కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్‌కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.

Similar News

News February 13, 2026

మున్సిపాలిటీలో ‘హంగ్’ ఉత్కంఠ: కింగ్ మేకర్లుగా ఎక్స్-అఫీషియో ఓట్లు..!

image

అలంపూర్ పురపాలక ఎన్నికల సమరం ముగిసింది, కానీ అసలు సిసలైన రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలైంది. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడి, ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఛైర్మన్ ఎన్నికలో నిర్ణయాత్మక శక్తిగా మారనున్న ఎక్స్-అఫీషియో ఓట్లు ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులు ఉన్నాయి.

News February 13, 2026

మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం

image

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 60 స్థానాలు ఉండగా 44 డివిజన్‌ల కార్పొరేట్ స్థానాలను కాంగ్రెస్ సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఫార్వర్డ్ బ్లాక్ 2, జనసేన ఒక డివిజన్లో గెలుపొందాయి. 57వ డివిజన్లో రీకౌంటింగ్ చేయగా బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు.

News February 13, 2026

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ హవా

image

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ సత్తా చాటింది. మెట్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. అందులో బీజేపీ 10 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను, బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలను గెలుచుకోగా స్వతంత్రులు 4 స్థానాలలో గెలుపొందారు. కాగా, ఛైర్‌పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఛైర్‌పర్సన్ ఎన్నికలో స్వతంత్రులు కీలకం కానున్నారు.