News November 13, 2025

వరంగల్: మహిళల భద్రత కోసం షీ బాక్స్..!

image

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు వరంగల్ పోలీసు శాఖ మహిళలకు స్ఫూర్తిదాయక పిలుపునిచ్చింది. ఏ మహిళైనా పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే లేదా అలాంటి ఘటనను గమనించినా, వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న SHe-Box వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.

Similar News

News November 13, 2025

HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

image

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్‌లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్‌లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్‌లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News November 13, 2025

నిరూపిస్తారా.. క్షమాపణ చెబుతారా: మిథున్

image

AP: మంగళంపేట భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ద్వేషపూరితంగా తమపై <<18274471>>ఆరోపణలు<<>> చేస్తున్నారని YCP MP మిథున్ రెడ్డి ఫైరయ్యారు. ‘ఆ భూమిని 2000లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. అప్పుడు అధికారంలో ఉంది మేం కాదు. ఆ భూమి డాక్యుమెంట్ ఆన్‌లైన్‌లో ఉంది. ఎవరైనా చూడవచ్చు. మీ ఆరోపణలను నిరూపిస్తారా లేదా క్షమాపణ చెబుతారా’ అని సవాల్ విసిరారు. గతంలో ఎర్రచందనం విషయంలో సవాల్ చేస్తే పారిపోయారని విమర్శించారు.

News November 13, 2025

అయిజ: రేపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

అయిజ మార్కెట్ సబ్ యార్డులో రేపు (శుక్రవారం) సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు విండో ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి గురువారం Way2News తో తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంలో అయిజ, గట్టు, మల్దకల్ మండలాల రైతులు మొక్కజొన్న విక్రయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.