News December 22, 2025
వరంగల్: మాజీ ACP, CI, SI సస్పెండ్

గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్‌తో పాటు ప్రస్తుతం సీసీఎస్ CI గోపి, ఎస్ఐ విఠల్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు నమోదు చేసినట్లుగా ఫిర్యాదులందడంతో, దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు.
Similar News
News December 30, 2025
ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఏర్పాటు.. తుది నిర్ణయం

ప్రకాశం, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. మార్కాపురం జిల్లా పరిధిలో 21 మండలాలు ఉండగా, మార్కాపురం డివిజన్ పరిధిలో 15, కనిగిరి డివిజన్ పరిధిలో 6 మండలాలు ఉండనున్నాయి. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం 28 మండలాలు ఉండనుండగా.. కందుకూరి డివిజన్ పరిధిలో 7, ఒంగోలు పరిధిలో 11, అద్దంకి డివిజన్ పరిధిలో 10 మండలాలతో ఉండనుంది. రేపే కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు.
News December 30, 2025
NRPT: ‘కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు వేయాలి’

మాదకద్రవ్యాల అనర్థాలపై యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మాదకద్రవ్యాల నిషేధ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగుపై నిఘా ఉంచాలని, కళాశాలల్లో తప్పనిసరిగా యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
News December 30, 2025
3.27 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ధాన్యం కొనుగోలు: కలెక్టర్

రైతులకు ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతోందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లాలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న 348 కేంద్రాల ద్వారా పారదర్శకంగా సేకరణ జరుగుతోందన్నారు. ఇప్పటివరకు సుమారు 63 వేల మంది రైతులు తమ పంటను విక్రయించారని, వారి ఖాతాల్లోకి రూ.782.59 కోట్ల నగదును జమ చేసినట్లు తెలిపారు.


