News January 24, 2026
వరంగల్ మార్కెట్‌కి 3 రోజుల వరుస సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం రిపబ్లిక్ డే సందర్బంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News April 8, 2026
కాళేశ్వరం, దేవాదుల మోటార్లు పాడయ్యేలా కుట్ర: హరీశ్

TG: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదేపదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతోందని, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఉత్తమ్‌కు రాసిన లేఖలో ప్రశ్నించారు.
News April 8, 2026
రెపో రేటు యథాతథం.. ప్రకటించిన RBI

వడ్డీ రేట్లలో RBI ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ(MPC) నిర్ణయాలను ఆయన మీడియాకు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి EMIలలో పెద్దగా మార్పులు ఉండవు. కాగా 2025 FEB-DEC మధ్య <<19064412>>రెపో రేటు<<>>ను 1.25% తగ్గించిన RBI.. ఈ ఏడాది తొలి సమీక్షలో 5.25%గానే కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
News April 8, 2026
ఆదిలాబాద్: నిధుల కోసం ‘స్నేహ’ హస్తం

సీఎం సభలో విపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ పురోగతి కోసం విభేదాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా విపక్ష నేతలు స్పష్టం చేయడం గమనార్హం.
మొండిగా వెళ్లకుండా అభివృద్ధి విషయంలో సానుకూలంగా స్పందించడం పట్ల సీఎం సైతం హర్షం వ్యక్తం చేశారు.


