News February 14, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే 5,531 మిర్చి రూ.11 వేలు, దీపిక మిర్చి రూ.17,500, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 1048 రకం మిర్చి రూ.11 వేలు, మక్కలు (బిల్టీ) రూ. 2,355, సూక పల్లికాయ రూ.6,500, పచ్చి పల్లికాయకి రూ.4,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News March 12, 2025
ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?
News March 12, 2025
HNK: గ్రూప్-1లో మెరిసిన సాయితేజ

TGPSC విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్‌లో నయీంనగర్‌కి చెందిన పులి సాయితేజ 507 మార్కులతో సత్తా చాటారు. సాయితేజ్ తండ్రి కిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా సాయితేజ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచారు.
News March 12, 2025
వరంగల్: బల్దియా పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

కరీంనగర్‌లోనే లోయర్ మానేరు డాం వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనులు కొనసాగుతున్నందున నేడు ఉదయం 8గంటల నుంచి 6గంటల వరకు నీటి సరఫరా జరగదని మున్సిపల్ అధికారులు తెలిపారు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం, మడికొండ, కడిపికొండ బట్టుపల్లి రాంపూర్ ఎల్లాపూర్ నేటి సరఫరా జరగదని పేర్కొన్నారు. ఇట్టి ప్రాంతవాసులు గమనించి సహకరించాలని ఎస్సీ ప్రవీణ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.