News November 12, 2024
వరంగల్ మార్కెట్లో చిరుదాన్యాల ధరలు ఇలా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. నిన్న పసుపు క్వింటాకి రూ.11,427 ధర రాగా నేడు రూ.11,781 ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2,495 ధర పలకగా నేడు రూ.2,465 ధర పలికింది. మరోవైపు సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా ఈరోజు రూ.5,900 ధర వచ్చింది.
Similar News
News November 23, 2024
జనగామ: మధ్యాహ్న భోజనం తయారీలో జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్
మధ్యాహ్నం భోజనం తయారీలో ప్రధానోపాధ్యాయులు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అన్ని పాఠశాలల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం తయారీ చేసే ప్రదేశాలు, పిల్లలు తినే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
News November 22, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> BHPL: అంబటిపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం!
> MLG: అన్న దమ్ములను హతమార్చిన మావోలు
> HNK: మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు
> MHBD: అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
> PLK: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
> HNK: రాత్రి పూట ఇళ్ళల్లో దొంగతనం చేసే అంతరాష్ట్ర దొంగ అరెస్టు
> JN: ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి
News November 22, 2024
రేపు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఓటర్ డ్రాఫ్ట్
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటరు డ్రాఫ్ట్‌ను శనివారం ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ జాబితా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహశీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వద్ద పరిశీలన కోసం అందుబాటులో పెట్టనున్నట్లు తెలిపారు.