News April 2, 2025
వరంగల్ మార్కెట్‌లో చిరుధాన్యాల ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.5,900, పచ్చి పల్లికాయ రూ.4,850 పలికింది. పసుపు (కాడి) క్వింటా ధర రూ.12,359, పసుపు (గోల)కి రూ.10,729 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,285 పలికినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News April 3, 2025
BREAKING.. గద్వాల: బాలుడి తల, మొండెం వేరైంది!

మల్దకల్ మండలంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నీలిపల్లి గ్రామంలో తల్లిదండ్రుల వెంట ఎనిమిదేళ్ల జీవన్ వరి పొలం దగ్గరికి వెళ్లాడు. వారు వరికోత యంత్రంతో పొలంలో పనులు చేయిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్లడంతో.. అది ఆ బాలుడి మీది నుంచి వెళ్లింది. దీంతో బాలుడి తల, శరీరం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 3, 2025
బొల్లాపల్లి: కన్న తల్లిని హతమార్చిన కొడుకు

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 3, 2025
కొత్త జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. కర్నూలులోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహా వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ వేడుకలో జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు.