News September 2, 2025

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..!

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.2,320 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.6,610, పచ్చి పల్లికాయకు రూ.4,480 ధర వచ్చింది. కాడి పసుపు రూ.10,889, పసుపు గోల రూ.10,629, 5531 రకం మిర్చి రూ.13,500 ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.

Similar News

News September 2, 2025

రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా : ఎస్పీ

image

జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులలో భాగంగా నేర నియంత్రణ చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ తెలిపారు. ఆగస్టు నెల గణాంకాల ప్రగతికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. నెల రోజులు పోలీస్ సిబ్బంది నిర్వహించిన నిఘాలో 1260 మంది అనుమానిత వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 65.600 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News September 2, 2025

వీఆర్ పురంలో గుర్తు తెలియని మృతదేహం

image

వీఆర్ పురం మండలంలోని చిన్న మట్టపల్లి పంచాయతీ పరిధిలోని ప్రత్తిపాక గ్రామ శివారులలో గుర్తు తెలియని పురుష మృతదేహం కనిపించిందని ఎస్ఐ సంతోశ్ కుమార్ మంగళవారం తెలిపారు. శబరి నది నుంచి కొట్టుకుని వచ్చి, బోర్లా పడి ఉందన్నారు. వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉండొచ్చని అన్నారు. ఎత్తు 5 అడుగుల రెండు అంగుళాలు, ఎరుపు రంగు షార్ట్ వేసుకుని ఉందన్నారు. ఎవరైనా గుర్తు పడితే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.

News September 2, 2025

కోటబొమ్మాలిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కోటబొమ్మాలి–తిలారు రైల్వే స్టేషన్ మధ్య రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లుగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అతని కుడిచేయిపై ‘శ్రీను’ అనే పచ్చబొట్టు ఉందని వివరించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.