News October 29, 2024
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా!
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.5,950 ధర రాగా.. నేడు రూ.4,600 ధర పలికింది. 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేలు ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటాకు సోమవారం రూ.10,859 ధర రాగా.. నేడు రూ.10,939 ధర వచ్చింది. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,550 ధర పలికిందని అధికారులు తెలిపారు.
Similar News
News November 24, 2024
SUNDAY SPECIAL.. ఆకట్టుకుంటున్న వరంగల్ రీజినల్ లైబ్రరీ
వరంగల్లో రీజినల్ లైబ్రరీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. గత ప్రభుత్వంలో ఈ లైబ్రరీని ఆధునికీకరించారు. ఫర్నిచర్, ఇంటర్నెట్, వైఫైతో పాటు.. దాదాపు బుక్స్ అన్నింటినీ డిజిటలైజేషన్ చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతేకాదు, రోడ్డుపై వెళ్తుంటే లైబ్రరీ గోడపై రంగులతో దిద్దిన ఓ బాలిక చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఈ లైబ్రరీని చూసి ఉంటే కామెంట్ చేయండి.
News November 24, 2024
విజయోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క లేఖలు
ఈనెల 26న గ్రామ పంచాయతీలో జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో పార్టీలకతీతంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు పాల్గొనాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క లేఖలు రాశారు. నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 95 గ్రామీణ నియోజకవర్గాల్లో రూ.2750 కోట్ల నిధులతో గ్రామ పంచాయతీల్లో ఇందిరా శక్తి మహిళా ఉపాధి భరోసాతో వివిధ అభివృద్ధి పనులు చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
News November 24, 2024
ములుగు: త్వరలో మరో రెండు పథకాలు అమలు చేస్తాం: మంత్రి సీతక్క
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ అందజేస్తునట్లు తెలిపారు. రూ.10లక్షల లోపు ఆరోగ్యశ్రీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500, పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు.