News January 23, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే మిర్చి ధరలు తగ్గాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.14,600 ధర పలకగా.. నేడు రూ.14,300కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి బుధవారం రూ.15,000 ధర రాగా.. నేడు రూ.13,500కి పతనమైంది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News September 18, 2025
వాహన మిత్ర’’ కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఆటో, మాక్సీ క్యాబ్ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కార్డ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు.
News September 18, 2025
జగిత్యాల: తండ్రి మందలించాడని కుమారుడి సూసైడ్

జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన రాహుల్ (బీటెక్ విద్యార్థి) కొంత కాలంగా ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఈ విషయం గమనించిన తండ్రి శ్రీనివాస్ మందలించడంతో రాహుల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 18, 2025
కలెక్టర్‌ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.