News February 17, 2025

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలి రాగా ధర మాత్రం గతవారంతో పోలిస్తే భారీగా తగ్గింది. గతవారం మొదట్లో క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. శుక్రవారం రూ.6,820కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.6,800కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 4, 2025

శ్రీకాకుళం: ‘పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణ కట్టుదిట్టం చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాసం మిగిలిన పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్ట్యా పటిష్ఠమైన రద్దీ నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో వీసీ నిర్వహించారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి వంటి ముఖ్య రోజుల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నందున భద్రతలు చర్యలు తీసుకోవాలన్నారు.

News November 4, 2025

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ

image

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లను జిల్లా వైద్యాధికారి ధనరాజ్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ రిజిస్టర్, ఫార్మసీ గదిని తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ తేజ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

News November 4, 2025

రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతిపై సమీక్ష

image

విశాఖపట్నంలో మంగళవారం జరిగిన వాల్తేర్ రైల్వే డివిజన్ సమీక్ష సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో వివిధ రైల్వేస్టేషన్స్‌లో సౌకర్యాలు కల్పన, కొత్త రైలు ప్రతిపాదనలుపై ప్రత్యేక దృష్టి సారించాలని DRMను ఆదేశించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి ఉన్నారు.