News April 8, 2025

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటితో పోలిస్తే భారీగా పడిపోయింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. నేడు రూ.7,355 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఒక రోజు వ్యవధిలోనే రూ. 50 ధర తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. ఎండాకాలం నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు సరకులు తీసుకొని రావాలని సూచిస్తున్నారు.

Similar News

News November 4, 2025

NLG: ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా.!

image

NLG జిల్లాలో ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. గ్రామాలు, మున్సిపల్ కేంద్రాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని, క్షేత్రస్థాయిలోని అధికారులపై ఉన్నతాధికారులు ఓ వైపు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, నదులు ప్రవహిస్తుండటంతో ప్రస్తుతం ఇసుక తేలే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు. అధికారులు స్పందించి ఇసుకను సరఫరా చేయాలన్నారు.

News November 4, 2025

APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) 6 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc( అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్), పీజీ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ) అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 4, 2025

NZB: 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్ల బోనస్ చెల్లింపు

image

వానకాలం సీజన్‌కు సంబంధించిన NZB జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్లు బోనస్ చెల్లించినట్లు DSO అరవింద్ రెడ్డి తెలిపారు. ఈ రైతుల 6,16,110 క్వింటాళ్లకు సంబంధించి రూ.500 చొప్పున బోనస్ చెల్లించామన్నారు. జిల్లాలోని 487 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,90,616 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన వివరించారు.