News July 4, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మళ్లీ పడిపోయింది. గత 3 నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా గురువారం క్వింటా పత్తి ధర రూ.7,565 నమోదవగా.. నేడు రూ.7,390కి తగ్గింది. ఒకరోజు వ్యవధిలోనే రూ.175 తగ్గడంతో పత్తి రైతులు నిరాశ చెందుతున్నారు. కాగా, నేడు మార్కెట్‌కు పత్తి అంతంత మాత్రంగానే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News July 4, 2025
కరీంనగర్: బయట ఫుడ్ తింటున్నారా..? బీ కేర్ ఫుల్

KNR, జ్యోతినగర్‌లోని రాజుగారి బిర్యానీ అడ్డా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. ఒక ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరిగాయి. కిచెన్, ఫ్రీజర్‌లో ముందురోజు మిగిలిపోయిన 17KGల వండిన చికెన్, కార్న్, ఇతర కూరగాయలు, వస్తువులను గుర్తించి ధ్వంసంచేశారు. చికెన్ ఐటమ్స్‌లో కృత్రిమరంగులు వాడినందుకు నోటీసులు జారీచేశారు. మాంసాహార ముడిపదార్థాలపై తప్పనిసరిగా తేదీ, లేబుల్ వేయాలని ఆదేశించారు.
News July 4, 2025
వరద విపత్తుల నిర్వహణకు సిద్ధం: ఖమ్మం కలెక్టర్

వరద విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణపై సమావేశమయ్యారు. గత సంవత్సరం వచ్చిన భారీ వరదలు, విపత్తుల నిర్వహణ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ప్రణాళిక తదితర అంశాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
News July 4, 2025
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

ఎరువుల షాపుల డీలర్లు, యజమానులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామాల్లో ఉన్న ఎరువుల షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.