News July 12, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పసుపు, పల్లికాయ ధరలు తగ్గాయి. > నిన్న రూ.13,759పలికిన పసుపు..నేడు రూ. 12,659కి పడిపోయింది. > సూక పల్లికాయ ధర నిన్న రూ. 6160 పలకగా..ఈరోజు రూ.6020 పలికింది. > పచ్చి పల్లికాయ ధర నిన్న రూ.4550 పలకగా.. నేడు రూ. 4300 పలికింది. > 5531 రకం మిర్చికి నిన్న రూ.13వేల ధర రాగా…నేడు రూ.12,500 వచ్చింది.

Similar News

News November 29, 2024

మండలంగా మల్లంపల్లి.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సీతక్క

image

ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ జీవో విడుదల కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం హర్షనీయమని, కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని నిరూపించడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.

News November 28, 2024

డివిజన్ హోదాను కల్పించేందుకు కార్యాచరణను ప్రారంభించడం గర్వకారణం: మంత్రి

image

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఒక్కో హామీని పోరాడి సాధించుకుంటున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‌కు డివిజన్ హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించడం యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి సురేఖ అన్నారు.

News November 28, 2024

ధాన్యం కొనుగోలు అంశంపై కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష

image

ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే ఆన్‌లైన్ చేసి పేమెంట్ త్వరగా వచ్చేలా చేయాలని అధికారులను HNK జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పేమెంట్ చెల్లింపుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.