News February 18, 2025
వరంగల్ మార్కెట్‌లో తటస్థంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు రైతన్నలకు నిరాశ కలిగిస్తున్నాయి. రోజురోజుకు ధర తగ్గుతూ ఉండటంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. సోమవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. ఈరోజు సైతం అదే ధర పలికింది. గత వారం రూ.7,200 పైగా ధర పలకగా, ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News February 16, 2026
నిరుద్యోగ యువతకు మత్స్యశాఖ గుడ్‌న్యూస్

జిల్లా నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ యూనిట్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 19 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో జనరల్ కేటగిరీకి 13 యూనిట్లు, మహిళలకు 2, ఎస్సీ వర్గానికి 3, ఎస్టీ వర్గానికి 1 కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
News February 15, 2026
వరంగల్: అభివృద్ధి కమిటీ సమావేశాలేవి?

వరంగల్‌లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశాలు సుమారు పదేళ్లుగా నిర్వహించడం లేదు. కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్, ప్రజాప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. సీకేఎం జీఎంహెచ్, ఎంజీఎం వంటి సర్కారు ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమితో రోగులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. గతంలో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించే సమస్యలను వెంటనే పరిష్కరించేవారు.
News February 15, 2026
WGL: కార్యకర్తలు ఎవరు? కట్టప్పలు ఎవరు?

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార-ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. కొన్ని వార్డుల్లో అనూహ్య ఫలితాలు రావడంతో అంతర్గత విభేదాలు, అసంతృప్తి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పని చేయాల్సిన వారే ప్రత్యర్థులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమికి బాధ్యులెవరు అన్న దానిపై నేతలు సమీక్షలు చేపడుతున్నారు.


