News February 6, 2025

వరంగల్: మార్కెట్‌లో ధరల వివరాలు..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు రాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి రూ.10,500 పలకగా.. అకిరా బ్యాగడి మిర్చి రూ.11వేలు, ఎల్లో మిర్చి రూ.18 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే 2043 రకం మిర్చి రూ.14 వేలు, 334 మిర్చి రూ.13వేలు ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News September 19, 2025

మేడారం జాత‌ర మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం: మంత్రులు

image

TG: తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ మాస్ట‌ర్ ప్లాన్‌కు CM రేవంత్‌ ఆమోదం ల‌భించగానే ఆధునికీకర‌ణ ప‌నులు ప్రారంభించి.. వంద‌రోజుల్లోగా పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలు తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.

News September 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 19, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 19, 2025

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట వాసి

image

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట పట్టణం వైబిఎన్ పల్లెకు చెందిన పోతుగుంట రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.