News September 18, 2025

వరంగల్ మార్కెట్లో ధాన్యాల ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం చిరుధాన్యాలు తరలివచ్చాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,500 ధర వస్తే.. పచ్చి పల్లికాయకు రూ.4,100 ధర వచ్చింది. అలాగే మక్కలు (బిల్టీ) రూ.2,280 ధర పలికింది. 5531 రకం మిర్చి క్వింటా రూ.13,200, దీపిక మిర్చి రూ.14 వేలు, పసుపు రూ.10,659 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News September 18, 2025

త్వరలో US టారిఫ్స్‌ ఎత్తివేసే ఛాన్స్: CEA

image

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్‌ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్‌కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

News September 18, 2025

పిల్లలు మొబైల్ / టీవీ చూస్తున్నారా?

image

పిల్లలు అల్లరి చేయగానే ఫోన్, టీవీ చూపించడం అలవాటు చేస్తున్నారా? ఇది మీ కోసమే. తాజా అధ్యయనం ప్రకారం పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా నిద్ర తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందట. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం, శారీరక శ్రమను ప్రోత్సహిస్తే ఈ ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

News September 18, 2025

జగిత్యాల: ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకున్న చైన్‌స్నాచర్లు

image

JGTL(D)లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల పోరండ్లలో వృద్ధురాలు బంగారం కోల్పోయిన ఘటన మరవకముందే మరో దొంగతనం వెలుగులోకి వచ్చింది. JGTL(R) సంఘంపల్లేకు చెందిన నేరెళ్ల లచ్చవ్వ ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగుడు.. మనవడిగా మభ్యపెట్టి నీళ్లు తీసుకున్నాడు. క్షణాల్లోనే ఆమె మెడలో ఉన్న తులం నర పుస్తెలతాడు లాక్కెళ్లాడు. వృద్ధులను స్నాచర్లు టార్గెట్ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.