News November 4, 2025
వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,920 పలకగా.. నేడు రూ. 30 పెరిగి, రూ.6,950 అయినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. మార్కెట్‌కు సుమారు 12 వేల పత్తి బస్తాలు వచ్చినట్లు చెప్పారు. కాగా వర్షం కారణంతో మార్కెట్లో కొనుగోళ్లకు అంతరాయం కలిగింది.
Similar News
News November 4, 2025
మంచిర్యాల: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉంటే రైతులు టోల్ ఫ్రీ నంబర్లు 1967, 180042500333, కంట్రోల్ రూమ్ నంబర్ 6303928682కు సంప్రదించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సూచించారు. వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 150, 97 పీఏసీఎస్, 63, మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News November 4, 2025
కార్తీక పౌర్ణమి: ఉపవాసం ఎలా ఉండాలి?

‘కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. అది వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చు. వాయుపురాణం ప్రకారం.. పెసరపప్పు-బియ్యం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా స్వీకరించవచ్చు. అయితే, ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మాటిమాటికి వద్దు’ అని పండితులు సూచిస్తున్నారు.
News November 4, 2025
మందమర్రి: సింగరేణిలో కళాకారుల పాత్ర కీలకం

సింగరేణిలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమని మందమర్రి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్బులో నిర్వహించిన కల్చరల్ మీట్ ప్రోగ్రాంని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి కళాకారులు పర్యావరణం, సేఫ్టీ వీక్ తదితర కార్యక్రమాల సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చి కార్మికులకు అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నారన్నారు.


