News March 18, 2025
వరంగల్ మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలిస్తే మంగళవారం మిర్చి ధరలు సైతం పెరిగాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,500 ధర రాగా.. నేడు రూ.13,650 పలికింది. 341 రకం మిర్చికి సోమవారం రూ.13,000 ధర రాగా ఈరోజు రూ. 13,100 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి క్వింటా నిన్న రూ.15,800 పలకగా ఈరోజు రూ.16 వేలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News March 18, 2025
కృష్ణా: పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు- కలెక్టర్

కృష్ణా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.
News March 18, 2025
IPLలో అత్యధిక ఫోర్లు కొట్టింది ఇతనే!

17 సీజన్లుగా ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPLలో వందల కొద్దీ రికార్డులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటి వరకు అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ల గురించి తెలుసుకుందాం. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్‌ది. ఈయన 222 మ్యాచుల్లో 768 ఫోర్లు కొట్టారు. డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ, ముంబై, పంజాబ్, హైదరాబాద్ జట్ల తరఫున ఆడారు. అతని తర్వాత కోహ్లీ(705), వార్నర్(663), రోహిత్(599), రైనా (506) ఉన్నారు.
News March 18, 2025
గద్వాల: 7వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గద్వాల రాజీవ్ మార్గ్‌లో చేపట్టిన నిరసన దీక్ష మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు పూడూరు చెన్నయ్య దీక్షకు మద్దతు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం అనుకూలం అంటూనే చట్టబద్ధత కల్పించడంలో వెనకడుగు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.