News February 12, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 6, 2025

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నల్గొండ మండలం చర్లపల్లిలోని హాకా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత లేకుండా సకాలంలో వాటిని వెంటవెంటనే పంపించాలని పేర్కొన్నారు.

News November 6, 2025

కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

image

కోయంబత్తూరు <<18187183>>గ్యాంగ్ రేప్<<>> బాధితురాలిపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 11.30గం.కు మహిళ, పురుషుడు చీకట్లో ఉండటం వల్ల కలిగే అనర్థాలను ఆపేదెలాగని అన్నారు. వీటిని పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని చెప్పారు. పేరెంట్స్ పెంపకం, టీచర్లతోనే మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీంతో నిందితులను ఒక్కమాట అనకుండా బాధితురాలిని తప్పుబట్టడమేంటని BJP నేత అన్నామలై మండిపడ్డారు.

News November 6, 2025

MBNR: 42% రిజర్వేషన్ కోసం బీసీ JAC మౌన ప్రదర్శన

image

జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం జ్యోతిబా పూలే విగ్రహం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ నాయకులు బెక్కం జనార్దన్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, వివిధ సంఘాలకు జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.