News March 13, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకి బుధవారం రూ.13,400 ధర రాగా.. నేడు రూ.13,300కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.12,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,500 ధర పలకగా ఈరోజు రూ.16,100 పలికినట్లు వచ్చినట్లు వ్యాపారస్తులు తెలిపారు.

Similar News

News November 13, 2025

యాదాద్రి: బీసీల ధర్మ పోరాట దీక్షలో ప్రభుత్వ విప్

image

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని అన్నారు. రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే భిక్ష కాదని అది మన హక్కు అని అన్నారు.

News November 13, 2025

కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

కుష్టువ్యాది నిర్మూలన కార్యాక్రమంలో భాగంగా వివిధ శాఖల సమన్వయంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రోగులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేశారు. జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఈ వ్యాధి గుర్తింపు, నిర్ధారణకు జరిగిన కార్యక్రమంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం గోడపత్రికను ఆవిష్కరించారు.

News November 13, 2025

యాదగిరిగుట్ట: కాలేజ్‌ను సందర్శించిన ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ

image

యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ సందర్శించారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచడానికి ఆదేశించినటువంటి 90 రోజుల ప్రణాళిక గురించి కళాశాలలోని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.