News June 14, 2024
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.19,000 ధర పలికింది. 341 రకం మిర్చికి రూ.16,500 ధర వచ్చింది. వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.17,500 ధర, టమాటా మిర్చి రూ.25వేల ధర వచ్చింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా ధరలు పెరిగాయి.
Similar News
News November 30, 2024
REWIND: వరంగల్‌లో 15 ఏళ్ల క్రితం అరెస్టయ్యా: KTR
మాజీ మంత్రి, సిరిసిల్ల MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.
News November 30, 2024
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
వరంగల్ నగరంలోని ఎంజీఎంం హాస్పిటల్‌ను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సౌకర్యార్థం చేపడుతున్న పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె రోగులతో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News November 29, 2024
ప్రజా పాలన వేడుకలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్ ప్రావీణ్య
ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నేడు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న దృష్ట్యా డిసెంబర్ 3న మునిసిపాలిటీల్లో అర్బన్ డే వేడుకలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు.