News July 22, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ‌కి నేడు మిర్చి తరలి రాగా కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తేజ మిర్చి శుక్రవారం క్వింటాకు రూ.17, 500 పలకగా.. నేడు రూ.17,800 పలికింది. అలాగే 341 రకం మిర్చి శుక్రవారం రూ.15,200 పలకగా.. నేడు రూ.14,000 ధర వచ్చింది. వండర్ హాట్ (WH) మిర్చికి రూ.13,500 ధర రాగా.. నేడు రూ.15,000 వచ్చింది.

Similar News

News October 2, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలు బదిలీలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.కె హమిద్ వరంగల్ వి.ఆర్ నుంచి బచ్చన్నపేటకు, కె.సతీశ్ బచ్చన్నపేట నుంచి ఐటీ వరంగల్‌కు, బి.చందర్ వరంగల్ మిల్స్ కాలనీ నుంచి వర్ధన్నపేటకు, ఏ.ప్రవీణ్ కుమార్ వర్ధన్నపేట నుంచి కేయూ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 2, 2024

వరంగల్: డీజే వినియోగం నిషేధం: పోలీస్ కమిషనర్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజేలనుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్స్, బాణాసంచా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News October 1, 2024

వరంగల్ నుంచి ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 12 వరకు ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామని వరంగల్ రీజియన్ RM డి.విజయభాను తెలిపారు. ప్రయాణికులకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. (HNK 125, JN 120, WGL 1 నుంచి 125, WGL 2 డిపో 125, MHBD 47, NSPT 119, PKL 93, TRR 48, BHPL 48) మొత్తం 850 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.