News February 25, 2025
వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11,100 పలకగా, దీపిక మిర్చి రూ.17,500 ధర పలికాయి. అలాగే ఎల్లో మిర్చికి రూ.19 వేలు, టమాటా మిర్చికి రూ.31,0111, సింగిల్ పట్టి రూ.31 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. గమనిక: రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా ఐదు రోజుల సెలవులు.
Similar News
News February 25, 2025
SRPT: గుండెపోటుతో వ్యక్తి మృతి

తుంగతుర్తిలో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన కటకం వెంకన్న (55) కొన్ని సంవత్సరాలుగా బ్రిక్స్, వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో షెడ్డులో పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 25, 2025
శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: SP

బుధవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం చేసేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 25, 2025
రేపు విశాఖ రానున్న బ్రహ్మానందం

శివరాత్రి సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో బుధవారం మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మహా కుంభమేళా పవిత్ర జలాలతో అభిషేకం చేయనున్నట్లు వెళ్లడించారు. రేపు ఉదయం 9.30 గంటల నుంచి కోటీ 8 లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం హాజరుకానున్నారని వెల్లడించారు.