News March 13, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.
News March 13, 2025
భవన నిర్మాణానికి 24 గంటల్లో అనుమతులు

భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని పట్టణ ప్రణాళిక శాఖ అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. బుధవారం కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.
News March 13, 2025
పెద్ద కార్పాముల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పెద్దకొత్తపల్లి మండల పరిధిలో మార్చి 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. పెద్దకొత్తపల్లి నుంచి పెద్దకార్పాములకు రాములు, స్వామిలు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందెళ్తున్న బైక్‌ని ఢీకొని కిందపడగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా బుధవారం రాములు చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు.