News April 9, 2025
వరంగల్ మార్కెట్లో రూ.1,000 తగ్గిన టమాటా మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు టమాటా మిర్చి ధర తగ్గింది. సోమవారం టమాటా మిర్చి క్వింటా ధర రూ.28 వేలు పలకగా.. నేడు రూ.27వేలకు పడిపోయింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,500 పలకగా.. ఈరోజు రూ.13వేలకు తగ్గింది. 5531 మిర్చికి నిన్నటిలాగే రూ.9 వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>
News September 18, 2025
చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.
News September 18, 2025
డీఎస్సీ అభ్యర్థులకు 134 బస్సులు: డీఈవో

రేపు అమరావతిలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని డీఈవో శామ్యూల్ తెలిపారు. వారిని అమరావతికి తీసుకెళ్లేందుకు 134 బస్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,590 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువులు సాధించారని అన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, అభ్యర్థులు ఉ.7 గంటల్లోపు అక్కడికి చేరుకోవాలని తెలిపారు.