News July 3, 2024

వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం క్వింటా పసుపు రూ.13,559 (నిన్న రూ.13,859) ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6000 అయింది. పచ్చి పల్లికాయకు రూ.4,300 ధర వచ్చింది. మరోవైపు మక్కలు రూ.2,535 పలకగా.. 5531 రకం మిర్చికి రూ.14,000 ధర వచ్చింది. పసుపు, పల్లికాయ ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.

Similar News

News November 29, 2024

వరంగల్: రాష్ట్ర స్థాయికి 28 ప్రాజెక్టుల ఎంపిక

image

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కు వరంగల్ జిల్లా నుంచి 28 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. నర్సంపేటలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఇన్‌స్పైర్ కేటగిరిలో 148, రాష్ట్రీయ బాల సైన్స్ కేటగిరిలో 352 ఎగ్జిబిట్లు వచ్చాయి. ఈ రెండు కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 28 ప్రాజెక్టులను జడ్జీలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. త్వరలో జరిగే స్టేట్ లెవల్ పోటీల్లో వాటిని ప్రదర్శించనున్నారు.

News November 29, 2024

చేర్యాల: BIRTHDAY రోజే బాలిక మృతి

image

కరెంట్ షాక్‌తో కావ్య(16) అనే <<14732971>>బాలిక మృతి<<>> చెందిన ఘటన చేర్యాలలో జరిగిన విషయం తెలిసిందే. నాగపురి గ్రామానికి చెందిన మజ్జిగ నర్సింలు-లావణ్య దంపతుల పెద్ద కూతురు కావ్య ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. నీళ్లు ట్యాంకులోకి పట్టేందుకు మోటార్ వైరును స్విచ్ బోర్డులో పెడుతుండగా కరెంటు షాక్‌కు గురైంది.హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే చనిపోయింది. బాలికకు పుట్టినరోజే నూరేళ్లు నిండాయని తల్లిదండ్రులు విలపించారు.

News November 29, 2024

WGL: జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, ఛైర్మన్

image

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజి ఎన్ఆర్ఐ మిలినియం ఆడిటోరియంలో సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీపీఆర్‌వో ఆయుబ్ అలీతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.