News September 25, 2024
వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా!
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సూక పల్లికాయ ధర రూ.5,840 పలికింది. అలాగే పచ్చి పల్లికాయ రూ.3800 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ.14 వేలు, పసుపునకు రూ.13,119 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల సరుకుల ధరలు తగ్గాయి.
Similar News
News November 25, 2024
MHBD: మొదటి జీతం అందుకోకుండానే టీచర్ మృతి
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొని మొదటి జీతం అందుకోకుండానే రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. MHBD జిల్లా గంగారం మండలం బావురుగొండ టీచర్ ఉపేందర్ (45) పాఠశాలకు వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని మృతి చెందారు. బయ్యారం మండలానికి చెందిన ఉపేందర్ ఇటీవల ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 25, 2024
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.
News November 25, 2024
వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన వరంగల్ కలెక్టర్ సత్య శారద
గీసుగొండ మండల కేంద్రంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి రైతులు పండిస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలను పండిస్తే నేలలు బాగుపడటమే కాకుండా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. రైతులు కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరిబాబు, స్థానిక రైతులు పాల్గొన్నారు.