News September 9, 2025
వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటా పత్తికి రూ.7,530 ధర పలకగా.. ఈరోజు రూ.7,580కి చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
Similar News
News September 9, 2025
ఇటిక్యాల: సైబర్ మోసం.. రూ.22 లక్షలు టోకరా

లాభాల ఆశ చూపించి ఓ యువకుడిని సైబర్ మోసగాళ్లు నిండా ముంచారు. ఉండవెల్లి మండలం, ఇటిక్యాలపాడుకు చెందిన గౌరెడ్డి వెంకటరెడ్డి, ఆన్‌లైన్ గ్రోయాప్‌లో రూ.50 వేలు పెట్టుబడితో రూ.3 లక్షలు లాభం వస్తుందన్న ప్రకటన చూసి మోసపోయాడు. గత నెల రోజుల వ్యవధిలో దశలవారీగా రూ.22 లక్షలు డిపాజిట్ చేశాడు. ఈ డబ్బును డ్రా చేయాలంటే మరో రూ.13 లక్షలు చెల్లించాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News September 9, 2025
పోక్సో కేసులో ముద్దాయిని పట్టుకున్న మహారాణిపేట పోలీసులు

మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులో ముద్దాయి షేక్ అబ్దుల్ కలాం 18 నెలల నుంచి కోర్టుకు హాజరు కావడం లేదు. కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసులు హైదరాబాద్, అనంతపురం జిల్లాలో విస్తృతంగా గాలించారు. సెల్‌ఫోన్ కూడా ఉపయోగించకుండా తిరుగుతున్న ముద్దాయిని మంగళవారం చాకచక్యంగా పట్టుకోవడంతో సిబ్బందిని సీపీ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.
News September 9, 2025
KNR: SRR విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీగెట్) పరీక్ష ఫలితాల్లో SRR ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కామర్స్ విభాగంలో అక్కెం తిరుమలకు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు, జంగం నందిని 3వ ర్యాంకు సాధించారు. బాటనీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు పుట్టి అఖిల సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.