News May 20, 2024

వరంగల్ మార్కెట్ నేడు పున:ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

Similar News

News December 21, 2025

జాతీయ కరాటే పోటీల్లో వర్ధన్నపేట బాలుడికి స్వర్ణం

image

భోపాల్‌లో నిర్వహించిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2025లో వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. పుస్కోస్ పాఠశాలలో చదువుతున్న ఉపేంద్ర, 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది క్రీడాకారులతో తలపడి అద్భుత నైపుణ్యంతో ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన ఉపేంద్రను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

News December 21, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు

image

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం చికెన్ విత్‌ స్కిన్ KG రూ.240 నుంచి రూ.260 పలకగా స్కిన్‌ లెస్ KG రూ.260-రూ.280గా ఉంది. అలాగే లైవ్ కోడి రూ.170-రూ.180 పలుకుతోంది. సిటీతో పోలిస్తే పల్లెటూరులో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది.

News December 21, 2025

WGL: భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.