News October 23, 2025

వరంగల్: మార్కెట్ సమస్యలు పట్టడం లేదా..?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్, లక్ష్మిపురం కూరగాయ, పండ్ల మార్కెట్లు, ముసలమ్మకుంట మామిడి మార్కెట్ హాల్‌లో కనీస సౌకర్యాలు లేక రైతులు ఆగ్రహంలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ హామీలు ఇప్పటివరకు అమలు కావట్లేదు. సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో సురక్షితత సమస్య ఉంది. జిల్లా రైతులు మంత్రి, ఎమ్మెల్యేలను సమస్య పరిష్కరించేందుకు మాముల మార్కెట్‌ను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News October 23, 2025

ASF: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. యువతి, యువకులు, విద్యార్థులకు ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు షార్ట్ ఫిలిమ్స్ పోటీల్లో ఉత్సాహంగా ఈనెల 31వరకు పాల్గొనాలని కోరారు.

News October 23, 2025

ATM కార్డు కాజేసి డబ్బులు డ్రా.. బాధితుల ఆవేదన

image

సత్తెనపల్లిలో ATM సెంటర్ వద్ద వద్ద గుర్తు తెలియని వ్యక్తి సాయం తీసుకున్న ఓ వృద్ధురాలి కార్డును దుండగుడు మార్చేశాడు. అక్టోబర్ 6 నుంచి 13వ తేదీ వరకు ఏకంగా 23 సార్లు నగదు డ్రా చేసి, మొత్తం రూ.2.87 లక్షలు కాజేశాడు. సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించిన దంపతులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 23, 2025

నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్.. సీఎస్‌కు సమ్మె నోటీసు

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని సీఎస్‌కు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) హెచ్చరించింది. టోకెన్లు ఇచ్చి రూ.900 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీపావళికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.