News August 9, 2025
వరంగల్: మా అక్క మనసు మంచిది..!

మీరు పైన చూస్తుంది ‘పెళ్లై 40 ఏళ్లు.. అయినా రాఖీ మిస్ అవ్వను!’ అనే వార్తకు వచ్చిన <<17345550>>కామెంట్<<>> ఇది. హనుమకొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన అక్కతో ఉన్న బంధాన్ని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘రవాణా వ్యవస్థ లేని రోజుల్లో ఏ రాత్రికో, తెల్లవారుజామునో వచ్చి అక్క రాఖీ కట్టేది. మంచి మనసుతో మా అక్క 45 ఏళ్లుగా రాఖీ కడుతోంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నా’ అని ఓ తమ్ముడు ఎమోషనల్ అయ్యాడు.
Similar News
News August 9, 2025
ఢిల్లీలో నేతలను కలిసినప్పుడు అరకు కాఫీ ఇస్తున్నా: CM

గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లను పెంచే విధంగా చర్యలు తీసుకుంటానమి CM చంద్రబాబు తెలిపారు. వారికి ఇన్సెంటివ్‌లు పెంచి ఇక్కడకు వచ్చేలా చూస్తామని చెప్పారు. అరకు కాఫీ లాంటి స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తన లక్ష్యమన్నారు. ఢిల్లీలో తాను ఎవరినైనా కలిస్తే శాలువా కప్పి అరకు కాఫీని ఇస్తున్నాని చెప్పారు. ఏజెన్సీలో వ్యయసాయాన్ని పోత్రహిస్తున్నామని, గిరిజనుల ఆదాయాన్ని పెంచుతామన్నారు.
News August 9, 2025
పాడేరు: సీఎంకి రాఖీ కట్టిన మంత్రి సంధ్యారాణి

సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పాడేరు మండలం వంజంగిలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన వివిధ ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రాఖీ కట్టారు. అనంతరం ఆమెను సీఎం ఆశీర్వాదించారు.
News August 9, 2025
విశాఖ: మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేత

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద బొక్క వీధిలోని వెల్డింగ్ దుకాణంలో సిలిండర్ పేలిన ఘటనల్లో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలను హోం మంత్రి అనిత పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వెల్డింగ్ దుకాణాల్లో పేలుళ్లు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై దుకాణాల యజమానులకు కార్మికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.