News February 11, 2026

వరంగల్: ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన ఈ పరీక్షలు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. చివరి రోజున జిల్లా వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపక బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

Similar News

News February 13, 2026

నర్సంపేటలో బీజేపీ బోణీ

image

నర్సంపేట మున్సిపాలిటీ పరిధి 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూలూరి రోజా రాణి విజయం సాధించారు. ఈ ఫలితంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మొదటి సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన జూలూరి రోజా రాణి తొలి ప్రయత్నంలోనే గెలుపొందారు.

News February 13, 2026

నర్సంపేట నాలుగో వార్డు కాంగ్రెస్ కైవసం

image

నర్సంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో నాలుగో వార్డు ఫలితం వెలువడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం భరత్ రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన సహోదరుడు బీరం నాగిరెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయం నాలుగో వార్డులో కాంగ్రెస్ బలాన్ని మరింత పటిష్టం చేయగా, స్థానికంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

News February 13, 2026

వరంగల్: ఎన్నికల కవరేజీ బిల్లులేవీ సారూ..?

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం వీడియో కవరేజ్ చేయించింది. నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలను కవరేజ్ చేయించిన అధికారులు వీడియో గ్రాఫర్లకు బిల్లులు ఇవ్వడంలో తాత్సారం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీల్లో కవరేజ్ చేసిన వీడియో గ్రాఫర్లు బిల్లులు అడిగితే అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.