News February 26, 2025
వరంగల్: ముమ్మరంగా తెర వెనుక ప్రచారం..!

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బయటకు పెద్దగా కనిపించలేదు. కానీ విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ప్రధానంగా విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న HNK, WGLతో పాటు NSPT, JN, MHBD, BHPL పట్టణాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉమ్మడి జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సామ దాన భేద దండోపాయాలను అమలు చేస్తున్నారు.
Similar News
News February 26, 2025
పాపన్నపేట: యువకుడి మృతదేహం లభ్యం

ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదన్నారు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉండి ఒంటిపై పచ్చని టీ షర్ట్, నల్లని షర్ట్, నిక్కరు ఉందని, ఆచూకీ తెలిస్తే స్టోషన్‌లో సంప్రదించాలన్నారు.
News February 26, 2025
సజావుగా ఎన్నికలు నిర్వహించండి: జిల్లా కలెక్టర్

ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్‌లో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తలారిసింగి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు జోన్లు, రూట్ల అధికారులు, సిబ్బందితో మాట్లాడి, తగు సూచనలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి అనుమాన నివృత్తి చేశారు.
News February 26, 2025
రాజౌరీలో ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్‌బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.