News July 18, 2024

వరంగల్: మురికి కుంటలో చిన్నారుల ఈత

image

తల్లిదండ్రుల అశ్రద్ధ పలు ప్రమాదాలకు కారణం అవుతుంది. పిల్లలకు కనీస అవగాహన లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ ఆడుకోవడం, ఈతకొట్టడంపై లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్‌లో చోటుచేసుకుంది. వరంగల్ పెరుకవాడకు చెందిన కొందరు చిన్నారులు బుధవారం సెలవుదినం కావడంతో స్థానికంగా ఉండే ఓ మురికి కుంటలో ఈత కొడుతూ కనిపించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాద్యులు అవుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News November 28, 2024

ధాన్యం కొనుగోలు అంశంపై కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష

image

ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే ఆన్‌లైన్ చేసి పేమెంట్ త్వరగా వచ్చేలా చేయాలని అధికారులను HNK జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పేమెంట్ చెల్లింపుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News November 28, 2024

MHBD: దీక్షదివస్ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ కవిత

image

రేపు దీక్షదివాస్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే ఏర్పాట్లను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపటి దీక్షదివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఆమె వెంట డోర్నకల్ మాజీ MLA రెడ్యా నాయక్, తదితరులు ఉన్నారు.

News November 28, 2024

వరంగల్‌: నిన్నటిలాగే తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి లాగే ఈరోజు తటస్థంగా ఉంది. గురువారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,840గా ఉంది. చలికాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరకులను మార్కెట్‌కు తీసుకొని రావాలన్నారు. తేమ లేని సరకులు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.