News November 13, 2025
వరంగల్: మేలు చేసిన సినిమా బంధం..!

ఆయన ఇద్దరితో సినిమా తీశాడు. ఇద్దరికీ ఎంతో దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య ఉన్న కేసును సైతం రాజీ పడేలా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సంచలనాలకు కేరాఫ్‌గా ఉండే కొండా మురళి దంపతులకు, ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో ఉండే డైరెక్టర్ RGVని కొండా సినిమా దగ్గర చేసింది. ఆ పరిచయంతో శివ రీ రిలిజ్ సందర్భంగా నాగార్జునతో సురేఖపై ఉన్న పరువు నష్టం కేసు రాజీ కోసం ప్రయత్నం చేయడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News November 13, 2025
జిల్లా వ్యాప్తంగా పోలీసుల క్రౌడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన

ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్, రోప్ పార్టీ విధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో పోలీసులు చాకచక్యంగా స్పందించేలా రియల్‌టైమ్ డెమోలు నిర్వహించారు. ప్రజా భద్రత కోసం సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.
News November 13, 2025
సూర్యాపేట: వేతనాలు విడుదల చేయాలి: పీఆర్టీయూ

2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఉపాధ్యాయ వేతనాల విడుదలకు డైరెక్టరేట్ నుంచి విడుదలైన జీవోను డీటీఓకు అందజేశారు. ఎస్టీఓలకు ఆదేశాలు జారీ చేసి వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు గోదేశి దయాకర్, ఫోరం అధ్యక్షుడు కోట రమేష్ పాల్గొన్నారు.
News November 13, 2025
నవాబుపేట: వ్యక్తిని చంపి కాల్చేశారు

MBNR జిల్లా నవాబుపేట మండలం యన్మన్‌గండ్ల గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గేటు పరిసర ప్రాంతాలలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని హత్య చేసి కాల్చడంతో పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ఈ హత్య ఘటన పరిసర ప్రాంతాలలో చర్చనీయాంశంగా మారింది.


