News March 11, 2025

వరంగల్: మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలు(బిల్టీ) ధర నిన్నటితో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటాకు రూ.2,305 ధర పలకగా.. నేడు రూ.2,310కి చేరింది. అయితే పల్లికాయ ధరలు తగ్గాయి. నిన్న సూక పల్లికాయకి రూ.7,160 ధర రాగా.. నేడు రూ.7,150కి చేరింది. అలాగే పచ్చి పల్లికాయకి సోమవారం రూ.4,800 ధర రాగా.. నేడు రూ.4,500కి పడిపోయింది. ఈరోజు మార్కెట్‌కి పసుపు రాలేదు.

Similar News

News February 28, 2026

మదీనా బస్సు ప్రమాద బాధితులకు ₹5L చొప్పున పరిహారం

image

TG: గత ఏడాది నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన <<18312045>>బస్సు ప్రమాదంలో<<>> 44 మంది HYD వాసులు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు CM రేవంత్ ఈరోజు సచివాలయంలో ₹5లక్షల చొప్పున పరిహారం అందజేశారు. గాయపడిన ఒకరికి ₹3లక్షలు ఇచ్చారు. ‘దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవు. కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సాయం ప్రకటించాం’ అని సీఎం తెలిపారు.

News February 28, 2026

అద్దంకి – శ్రీశైలం ఫ్రీ బస్సులో మహిళలను దించేసిన డ్రైవర్

image

ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో శనివారం నలుగురు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. అద్దంకి నుంచి శ్రీశైలం వెళ్తున్న RTC బస్సులో మార్కాపురం డిపో వద్ద నలుగురు మహిళలు ఎక్కారు. అయితే బస్సు డ్రైవర్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించి బలవంతంగా బస్సులోంచి కిందికి దించేశాడని మహిళలు RTC కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.. మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 28, 2026

మనోహరాబాద్: లింగారెడ్డిపేటలో చిరుత కలకలం!

image

లింగారెడ్డిపేట గ్రామ శివారులో చిరుత దాడిలో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యకు చెందిన పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల ఆధారంగా ఆనవాళ్లను సేకరించారు.