News July 10, 2025
వరంగల్: యూరియా కొరత.. నాట్లు వేసేదెలా?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇంకా 50 శాతం యూరియా జిల్లాకు రావాల్సి ఉందని వ్యవసాధికారులు చెబుతున్నారు. అయితే నారుమళ్లలో వరి నారు ముదిరిపోతోందని రైతులు దిగులు చెందుతున్నారు. సకాలంలో యూరియా అందజేస్తే వరి నాట్లు వేసుకుంటామని రైతులు అంటున్నారు. యూరియా అందక వర్షాలు పడక నారు మళ్లలోనే వరినారు ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News September 5, 2025
వరంగల్ జిల్లాలో ముందస్తు గురు పూజోత్సవాలు..!

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. కానీ మిలాద్ ఉన్ నబి పండుగ, గణపతి నిమజ్జనం ఉండడంతో ప్రభుత్వం అధికారిక హాలిడే ప్రకటించింది. దీంతో ఆయా పాఠశాలల్లో ముందస్తుగానే వర్ధన్నపేట ఉప్పరపల్లిలో సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.
News September 4, 2025
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా భూక్య హరిలాల్ నాయక్

వర్ధన్నపేట మండలం ల్యాబర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న భూక్య హరిలాల్ నాయక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చిన్నతనంలో ఇదే పాఠశాలలో చదువుకొని, ఓనమాలు నేర్చిన పాఠశాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో మనబడి పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాతలను, పూర్వ విద్యార్థులను ఆహ్వానిస్తూ బడి అభివృద్ధికి పాటుపడ్డారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచారు.
News September 4, 2025
ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఇంజినీరింగ్ బృందం

ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ బృందం మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రిలిమినరీ సర్వేలో భాగంగా పరిశీలించింది. అనంతరం వారు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారదతో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఏఎఐ ఏజీఎంలు నటరాజ్, మనీష్ జోన్వాల్, మేనేజర్లు ఓం ప్రకాష్, రోషన్ రావత్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు .