News August 22, 2025
వరంగల్: యూరియా కోసం రక్తం చిందిస్తున్న రైతన్నలు

అదునుకు యూరియా వేయకపోతే పంట ఆగమవుతుందేమోనని భయంతో ఉమ్మడి వరంగల్ రైతన్నలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. MHBD(D) మరిపెడ(M) మల్లమ్మ కుంటతండాకు చెందిన రైతు లక్కా యూరియా కోసం క్యూలో నిలబడి సోమ్మసిల్లి కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. గూడూరు(M) లక్ష్మీపురానికి చెందిన రైతు బిచ్చనాయక్ యూరియా కోసం 40KM దూరం నుంచి కురవి(M) చింతపల్లికి వచ్చాడు. యూరియా దొరకక తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
Similar News
News August 22, 2025
వందే భారత్ రైళ్లు ఇవే.. అసంతృప్తిగా ‘HYD- నాగపూర్’

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 20707, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 20834, కాచిగూడ నుంచి బెంగళూరు 20703, సికింద్రాబాద్ నుంచి తిరుపతి 20701, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ 20102 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జులై నాటికి విశాఖపట్నం వెళ్లే రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో గరిష్ఠంగా ఉండగా, నాగపూర్ వెళ్లే రైలు ఆక్యుపెన్సీ రేషియో అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News August 22, 2025
HYD: 42 ఏళ్ల పాలిటెక్నిక్ కాలేజ్ పరిస్థితి ఇదీ..!

రామంతపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇందిరా బ్లాక్ భవనం ప్రమాదకరంగా మారింది. 42 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలలో అనేక భవనాల పరిస్థితి అధ్వాన స్థితికి చేరింది. ప్రభుత్వ యంత్రాంగం నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని భవనాలకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News August 22, 2025
ORR వరకు మంచినీటికి డోకా లేకుండా ప్రణాళిక

రాబోయే 2 ఏళ్లలో 300 MGD గోదావరి జలాల అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మహానగర అవసరాలు తీరేలా వాటర్ నెట్వర్క్ రూపకల్పనకు జలమండలి కార్యాచరణ సిద్దం చేస్తోంది. ORR వరకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించడంతో పాటు, ఫోర్త్ సిటీ సహా ఇతర అవసరాలు తీర్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.