News July 10, 2025
వరంగల్: రవాణా శాఖలోనే అవినీతి ఎక్కువ..!

ఉమ్మడి జిల్లాలో ACB దాడులను ముమ్మరం చేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో 126 కేసులుండగా.. జిల్లాలో 10 కేసుల్లో 18 మందిని అరెస్టు చేశారు. రవాణా శాఖలో ఆరుగురు, పంచాయతీరాజ్ శాఖలో నలుగురు, విద్యా శాఖలో ఇద్దరు చొప్పున మొత్తం 10 కేసుల్లో 18 మందిని ACB అధికారులు పట్టుకున్నారు. HNK జిల్లాలో 2, WGL 1, జనగామ 2, MHBDలో 3, ములుగులో 2 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే రవాణా శాఖలోనే అవినీతి ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి.
Similar News
News July 10, 2025
పిఠాపురం: పవన్ కళ్యాణ్ మంచి మనసు

పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ చిన్నారులకు అండగా ఉంటానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకుంటున్నారు. వరుసగా రెండో నెల కూడా తన జీతాన్ని చిన్నారుల సంక్షేమానికి కేటాయించారు. నియోజకవర్గంలోని 46 మంది పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున మొత్తం రూ. 2.30 లక్షలను పంపిణీ చేయించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి్ మర్రెడ్డి శ్రీనివాస్ చిన్నారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఈ నగదును అందజేశారు.
News July 10, 2025
రేపు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విశాఖ రానున్నారు. రేపు ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కు వెళ్తారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి విశాఖలో బస చేస్తారు. శనివారం పార్వతీపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని శనివారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News July 10, 2025
భద్రాచలంలో అట్టహాసంగా దమ్మక్క సేవా యాత్ర

ఆషాఢ శుద్ధ పూర్ణిమ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు దమ్మక్క సేవా యాత్ర గురువారం రామాలయ అధికారులు, ఆలయ అర్చకులు, గిరిజనులు ఘనంగా నిర్వహించారు. దమ్మక్క చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి కళాకారుల నృత్యాల నడుమ యాత్ర వైభవంగా సాగింది. యాత్రలో పాల్గొనేందుకు వందలాది మంది గిరిజన భక్తులు తరలివచ్చారు.