News November 29, 2024
వరంగల్: రాష్ట్ర స్థాయికి 28 ప్రాజెక్టుల ఎంపిక

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కు వరంగల్ జిల్లా నుంచి 28 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. నర్సంపేటలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఇన్‌స్పైర్ కేటగిరిలో 148, రాష్ట్రీయ బాల సైన్స్ కేటగిరిలో 352 ఎగ్జిబిట్లు వచ్చాయి. ఈ రెండు కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 28 ప్రాజెక్టులను జడ్జీలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. త్వరలో జరిగే స్టేట్ లెవల్ పోటీల్లో వాటిని ప్రదర్శించనున్నారు.
Similar News
News July 6, 2025
వరంగల్: ఇక్కడి రోటి యమ ఫేమస్..!

ఉత్తరాది రుచులు ఇక్కడి యువతను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వలసదారులు వర్ధన్నపేటతో పాటు రాయపర్తి, వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి వెంట డాబాలను ఏర్పాటు చేసి అక్కడి రోటితో పాటు పలు కర్రీలు చేస్తూ రుచులు చూపిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే వంటకాలు కావడంతో ప్రతి ఒక్కరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.
News July 5, 2025
నర్సంపేట: ఇళ్లలో చోరీ.. ఏడుగురు అరెస్ట్

నర్సంపేటలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ అంకిత్ వివరాలు.. ఖానాపురం మండలానికి చెందిన రాజేశ్, నర్సంపేటకు అక్షయ్ కుమార్, అక్షయ్, సాయిరాం, ఉదయ్, విపిన్, సుబానిలు గ్రూప్‌గా ఏర్పడి డబ్బుల కోసం ఇళ్లల్లో దొంగతనం చేస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో బంగారాన్ని కుదువ పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
News July 5, 2025
వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.