News December 19, 2025
వరంగల్: రిలయన్స్ స్మార్ట్‌పై కేసు నమోదు

వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోగల రిలయన్స్ స్మార్ట్‌పై కేసు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రలాజికల్ ఇన్స్పెక్టర్ మనోహర్ తెలిపారు. జడల శ్యామ్ అనే వినియోగదారుడికి మాయిశ్చరైజర్ క్రీంను ఎమ్మార్పీ ధర రూ.131 ఉండగా రూ.141లకు విక్రయించారు. అతను తగిన ఆధారాలతో తమకు ఫిర్యాదు చేయగా రిలయన్స్ స్మార్ట్‌లో తనిఖీలు చేసి అధిక ధరకు అమ్మినట్లు నిర్ధారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 24, 2025
సాగర్ కాలువలో విషాదం.. ఒక విద్యార్థి మృతదేహం లభ్యం

ఖమ్మం: సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థులలో ఒకరి ఆచూకీ దొరికింది. కొద్దిసేపటి క్రితం గాలింపు చర్యల్లో భాగంగా అబ్దుల్ సుహాన్ మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 24, 2025
భారత్‌తో సయోధ్య.. పాక్‌కు ఆయుధాలు: చైనా వ్యూహంపై US నివేదిక

భారత్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకుంటూ ద్వైపాక్షిక సంబంధాలను ఇంప్రూవ్ చేసుకునేందుకు చైనా యత్నిస్తున్నట్లు అమెరికా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో FC-31, J-10C, JF-17 వంటి యుద్ధ విమానాలతో పాటు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూరుస్తూ పాకిస్థాన్‌తో సైనిక సంబంధాలను మెరుగుపర్చుకుంటోందని తెలిపింది. అయితే, గత అనుభవాల దృష్ట్యా భారత్ మాత్రం చైనాతో సంబంధాల పురోగతిలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడింది.
News December 24, 2025
జీడిమామిడిలో అంతర పంటల వల్ల లాభమేంటి?

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్‌ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.


