News July 13, 2024
వరంగల్: రూ.3 కోట్లు మోసం.. వ్యక్తి అరెస్ట్

వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామానికి చెందిన మధుకర్ అనే వ్యాపారిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా శ్రీ కనకమహాలక్ష్మీ ట్రేడర్ పేరుతో వ్యాపారుల నుంచి రూ.3 కోట్లు మోసం చేసినట్లు బాధితుడు జూలూరి కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News February 21, 2026
ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి: కలెక్టర్

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయ్‌తో కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్డు పనుల విషయంలో భూసేకరణ చేపట్టాలన్నారు.
News February 20, 2026
వరంగల్: తనిఖీలు లేకనే .. ఉపాధ్యాయుల గైర్హాజరు!

ప్రభుత్వ పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేనందునే ఉపాధ్యాయులు విధులకు హాజరై డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని నెక్కొండ మండలంలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డీఈవో రంగయ్య నాయుడు శుక్రవారం సస్పెండ్ చేసిన క్రమంలో విద్యాశాఖ అధికారులు ఇన్నాళ్లకు మేల్కొన్నారా..!? అంటున్నారు. కొందరు హెచ్ఎంల కారణంగానే టీచర్లు డుమ్మా కొడుతున్నట్లు చర్చ సాగుతోంది.
News February 20, 2026
WGL: ప్రత్యేక తరగతులపై కొరవడిన పర్యవేక్షణ!

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఒక వైపు కలెక్టర్ చెబుతున్న.. మరోవైపు ప్రత్యేక తరగతుల నిర్వహణ అధ్వానంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 8-9, సాయంత్రం 4.15 -5.15 గంటల వరకు స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, వాటిపై పర్యవేక్షణ లేదు. గతంలో మాదిరిగా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందిచే ఇన్విజిలేటర్ డ్యూటీస్, టెస్టులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.


