News December 3, 2025
వరంగల్: రెండో విడతకు జోరుగా నామినేషన్లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వారీగా మహబూబాబాద్‌లో అత్యధికంగా 1,118 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయి. వరంగల్‌లో 830, జనగామలో 551, హనుమకొండలో 524, భూపాలపల్లిలో 519, ములుగులో 288 నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News December 6, 2025
NGKL: జిల్లాలో 208 వార్డు స్థానాలు ఏకగ్రీవం

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో 208 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 151 గ్రామ పంచాయతీల పరిధిలో 1326 వార్డులు ఉండగా అందులో 208 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2,774 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నారు. వెల్దండ మండలంలో అత్యధికంగా 66 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడూరు మండలంలో 16 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News December 6, 2025
రబీ నువ్వుల సాగు.. నేలలు, నాటే సమయం

మురుగునీటి పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వుల పంట సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. తగినంత తేమ నిలుపుకొనే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మరింత అనువైనవి. కోస్తా జిల్లాల్లో రబీలో/రబీ వేసవి పంటగా డిసెంబర్ రెండో పక్షం నుంచి జనవరి నెలాఖరు వరకు నువ్వులను విత్తుకోవచ్చు. విత్తుట ఆలస్యమైతే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
News December 6, 2025
ASF: గ్రామాల్లో ఎన్నికల దావత్లు

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో ASF జిల్లా గ్రామాల్లో ఎన్నికల ప్రచార వేడి మొదలైంది. అభ్యర్థులు తమ అనుచరులు వెంటే ఉండేందుకు ప్రతిరోజు దావత్లు ఏర్పాటు చేస్తున్నారు. పల్లెల్లో ముక్క, చుక్కలకు కొదవ లేకుండా పోయింది. అభ్యర్థులు ఉదయం టిఫిన్లతో సహా రాత్రి దావత్ల వరకు అందిస్తున్నారు. అంతేకాకుండా, ప్రచారానికి వెళ్లే అనుచరులకు సైతం రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తుండటం గమనార్హం.


