News February 14, 2025

వరంగల్: రైతన్నకు తీవ్ర నిరాశ.. భారీగా పడిపోయిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈవారం మొదటి నుంచి పత్తి ధరలు భారీగా పడిపోతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950, గురువారం రూ.6,900కి పడిపోయింది. నేడు ఇంకా పతనమై రూ.6820కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రూ.240 ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Similar News

News November 5, 2025

ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

image

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News November 5, 2025

సామూహిక దీపారాధనలో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహించిన సామూహిక దీపారాధన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే పాల్గొన్నారు. శ్రీ భీమేశ్వరాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి,ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన దీపాలను వెలిగించారు. కాగా, సామూహిక దీపారాధన కార్యక్రమంలో భాగంగా భక్తులు వివిధ ఆకారాల్లో వెలిగించిన దీపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

News November 5, 2025

వేములవాడ రాజన్న క్షేత్రంలో జ్వాలాతోరణం

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో బుధవారం సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం వేళలో శ్రీ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు సాయంత్రం ఆలయ రాజగోపురం ముందు భాగంలో జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహా పూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.