News November 4, 2025
వరంగల్: రైతన్నకు నిరాశ.. తగ్గిన మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం మొక్కజొన్న భారీగా తరలివచ్చింది. ఈ క్రమంలో సోమవారంతో పోలిస్తే నేడు మక్కల ద్వారా తగ్గింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095 ధర రాగా, నేడు రూ.2,055 ధర వచ్చింది. అలాగే దీపిక మిర్చి రూ.14,500 ధర పలికింది. దీంతో రైతన్నలు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న తడవడం, ధర సైతం తగ్గడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
Similar News
News November 4, 2025
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. రేపు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, ఎల్లుండి రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మే ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు కొనుగోళ్లతో పాటు సి.సి.ఐ కొనుగోళ్లను నిలుపుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు తేమలేని పత్తిని మాత్రమే తీసుకురావాలన్నారు.
News November 4, 2025
BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.
News November 4, 2025
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

నిరుపేదల సంక్షేమం కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే లబ్ధిదారులను, అధికారులను ఆదేశించారు. మంగళవారం వాంకిడి మండలం జైత్పూర్ గ్రామంలో కొనసాగుతున్న పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇందిరమ్మ పథకంలో ఈ గ్రామం మొదటి విడత మోడల్ గ్రామంగా ఎంపికైందని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


