News February 26, 2025
వరంగల్: రైతన్నలు సిద్ధంగా ఉన్నారు: మాజీ MLA

రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మిర్చి పంట ధరలు పడిపోయి రైతన్నలు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఎనుమముల మార్కెట్‌ను సందర్శించి రైతన్నల కష్టాలను అడిగి తెలుసుకున్నామన్నారు.
Similar News
News February 26, 2025
వరంగల్: ఎమ్మెల్సీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్‌లో బ్యాలెట్ పేపర్ల పరిశీలన, పోలింగ్ సామగ్రి కేంద్రాల వారీగా వేరుచేసి పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది తుది రాండమైజేషన్ కలెక్టర్ నిర్వహించి 13 కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. పోలింగ్ కేంద్రాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
News February 26, 2025
వరంగల్: ఇంట్లో పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

వరంగల్ కొత్తవాడలో తాళం వేసిన ఇంట్లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలడంతో అక్కడే నివసిస్తున్న ప్రజలందరూ ఉలిక్కి పడ్డారు. తాళం వేసిన ఇంట్లో అనుమానాస్పద పదార్థాలు పేలినట్లు చర్చించుకుంటున్నారు. ఆందోళనకు గురైన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక మట్టేవాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News February 26, 2025
వరంగల్: నలుగురి ARREST

వరంగల్ కాశిబుగ్గలోని శాంతినగర్ చెరువు కట్టమీద నలుగురు వ్యక్తులు గంజాయి తాగుతుండగా పెట్రోలియం చేస్తూ వచ్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25,000 విలువ చేసే కేజీ గంజాయి, నాలుగు సెల్ ఫోన్స్, రూ.17,500 నగదును స్వాధీనపరచుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపారు.