News October 29, 2025

వరంగల్: రైతులకు ముఖ్య గమనిక.. 4 రోజులు వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. మొంథా తుఫాన్ కారణంగా గురు, శుక్రవారం ప్రత్యేక సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరకులు తీసుకురావొద్దని, సోమవారం మార్కెట్ పున: ప్రారంభం అవుతుందన్నారు.

Similar News

News October 30, 2025

ప్రకాశం: UG పరీక్షలు వాయిదా

image

మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు జరగాల్సిన గ్రాడ్యుయేట్ (UG) 3, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటిని తిరిగి నవంబర్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. డీవీఆర్ మూర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 30, 2025

అనకాపల్లి: నేడు కూడా కొనసాగనున్న పునరావాస కేంద్రాలు

image

మొంథా తుఫాన్ తీరం దాటినా పునరావాస కేంద్రాలు గురువారం కూడా కొనసాగుతాయని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జిల్లాలో 78 పునరావాస కేంద్రాల్లో 3,993 మంది ఆశ్రయం పొందుతున్నారు. కేంద్రాల్లో వీరికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు మండల స్థాయి అధికారులు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు.

News October 30, 2025

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు.. తొలుత కొడంగల్‌లో

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్‌లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్‌కు ID కార్డులు, 8-10th స్టూడెంట్స్‌కు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు.