News February 16, 2025
వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.
Similar News
News November 5, 2025
సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలి: ADB SP

డయల్ 100 సిబ్బంది పటిష్టమైన సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం పోలీస్ హెడ్ కోటర్స్ సమావేశ మందిరంలో జిల్లాలోని బ్లూ కోర్ట్, డయల్ 100 సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిరంతరం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఉండాలని, డయల్ 100 సేవలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాత్రుళ్లు గస్తీ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.
News November 5, 2025
NEET-SS దరఖాస్తులు ప్రారంభం

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.
News November 5, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.


