News March 18, 2025

వరంగల్: రైలు తగిలి తెగిపడ్డ చేయి

image

రైలు తగిలి చేయి తెగిపడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. వరంగల్ రామన్నపేటకు చెందిన నరసింహ (50) వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై నిలుచున్నాడు. అప్పుడే వచ్చిన జైపూర్ ఎక్స్‌ప్రెస్ అతడికి తగలడంతో చేయి తెగి పడింది. వెంటనే రైల్వే సిబ్బంది 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, ప్రథమ చికిత్స అందించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 18, 2025

శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

image

శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీపై రాజు మాట్లాడుతూ.. అది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ అనడంతో శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. అయితే దీనిపై రాజు స్పందిస్తూ.. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయమా అంటూ విమర్శించారు.

News March 18, 2025

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. 325 పాయింట్లు లాభ పడిన నిఫ్టీ 22,824 వద్ద ట్రేడ్‌ను ముగించింది. మరోవైపు, 1131 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 75,301 వద్ద ముగిసింది. అశోక్ లేల్యాండ్, వేదాంత, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి.

News March 18, 2025

నరసరావుపేట: బాలలకు ఆధార్ నమోదు చేపట్టాలి

image

జిల్లాలోని బాలలకు ఆధార్ నమోదు కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అరుణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి నెలలో రెండు దఫాలుగా ఆధార్ క్యాంపులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19-22 వరకూ, 25-28 వరకూ మొత్తం 8 రోజుల పాటూ పాటు క్యాంపులు ఈ క్యాంపుల ద్వారా జిల్లాలో 20వేల మంది బాలలకు ఆధర్ ఆధార్ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!